TATA SKY DEALER HYDERABAD OFFERSTATA SKY LATEST BINGE BOX FEATURES
TATA SKY NEW OFFER 2,999/-
డిటిహెచ్ రంగంలో అధిక మంది వినియోగదారులను కలిగి ఉన్న టాటా స్కై తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి రకరకాల సెట్-టాప్ బాక్స్ లను అందిస్తున్నది. ఆండ్రాయిడ్ ఆధారిత ప్రయోజనాలతో టాటా స్కై విడుదల చేసిన బింగే + సెట్-టాప్ బాక్స్ ధరలను ఇప్పుడు మళ్ళీ తగ్గించింది. ఈ ప్రీమియం STB ధర మీద రూ.1,000 తగ్గించి కొత్త కస్టమర్లకు రూ.2,999 ధర వద్ద అందిస్తున్నది. దీనితో పాటు కొత్త కస్టమర్లకు ఆరు నెలల టాటా స్కై బింగే చందా మరియు మూడు నెలల అమెజాన్ ప్రైమ్ వీడియో చందాను ఉచితం అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ మీద ధర తగ్గింపు టాటా స్కై తన ఆండ్రాయిడ్ టీవీ STB బింగే + ను 5,999 రూపాయల ధర వద్ద ప్రారంభించిన విషయం అందరికి తెలిసినదే. తరువాత బింగే + సెట్-టాప్ బాక్స్ ను కొన్ని నెలల క్రితం రూ.3,999 లకు తగ్గించారు. కానీ ఇప్పుడు కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడానికి దీని యొక్క ధరను మరింత తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది. కొత్త వారు టాటా స్కై బింగే + ను రూ.2,999 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. స్మార్ట్ టీవీని ఉపయోగించని వినియోగదారులకు ఇది ఒక మంచి ఎంపిక. Binge + STB అనేది వినియోగదారులను OTT యాప్ లను మరియు ఉపగ్రహ TV రెండింటినీ చూడటానికి అనుమతిస్తుంది.
టాటా స్కై బింగే + STB ఎందుకు? టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ అనేది అన్ని రకాల OTT యాప్ లతో అద్భుతమైన ఉత్పత్తి. ఇది టాటా స్కై యొక్క సొంత ‘టాటా స్కై బింగే' యాప్‌ను కూడా కలిగి ఉంది. ఇది గడిచిన ఏడు రోజుల వరకు అన్ని రకాల ప్రోగ్రాంలను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ సెట్-టాప్ బాక్స్ ఆండ్రాయిడ్ టీవీపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వాయిస్-ఎనేబుల్ రిమోట్‌ను కూడా అదనంగా పొందవచ్చు. లీనియర్ టీవీ మరియు OTT యాప్ల మధ్య మారడం కూడా సులభంగా ఉంటుంది. ఇటీవలే టాటా స్కై బింగే + ఎస్‌టిబిలో కొత్త లాంచర్‌ను కూడా జతచేస్తోంది. ఇది వారి హోమ్ స్క్రీన్‌లో వినియోగదారులకు మరింత ఇంటరాక్టివ్ కంటెంట్‌ను తీసుకువస్తుందని తెలిపారు
టాటా స్కై బింగే + STB కొత్త కనెక్షన్ ఆఫర్లు టాటా స్కై యొక్క కొత్త బింగే + కనెక్షన్‌ను పొందిన వారికి ఆరు నెలల టాటా స్కై బింగే సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. ఇదే కాకుండా అందుబాటులో ఉన్న ఆఫర్లలో టాటా స్కై బింగేతో పాటు మూడు నెలల అమెజాన్ ప్రైమ్ చందాను కూడా ఉచితంగా పొందవచ్చు. ఆ తర్వాత నెలవారీ ధర రూ.129 నుండి మొదలవుతుంది. టాటా స్కై టాటా స్కై బింగే ధరను ఇటీవల రూ .249 నుండి రూ .299 కు పెంచింది. ఇది డిస్నీ + హాట్‌స్టార్, ZEE5, SunNXT, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, హంగమా ప్లే, ఈరోస్ నౌ మరియు షెమరూమీ యొక్క ప్రీమియం సభ్యత్వాలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.
0 comments: